పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ నేడు విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్రారంభం కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నట్లు నిర్మాత రత్నం తెలిపారు. అలానే తమ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 28న గ్రాండ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.
ఇప్పటికే హరిహర వీరమల్లు నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ టీజర్స్ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, విక్రమ్ జీత్ విర్క్, నోరా ఫతేహి కీలక పోషిస్తున్న ఈ భారీ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.