Homeసినిమా వార్తలు'హరి హర వీర మల్లు' : నిర్మాతకు అది దురదృష్టం

‘హరి హర వీర మల్లు’ : నిర్మాతకు అది దురదృష్టం

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న మూడు సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగం మే 9న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

ఇతర కీలక పాత్రల్లో బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ పై ఈ మూవీని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఇతర వర్క్స్ వేగంగా పూర్తి చేస్తోంది టీమ్. 

అయితే తన పార్ట్ బ్యాలెన్స్ షూటింగ్ ని పూర్తి చేసేందుకు ఇటీవల డేట్స్ కేటాయించారు పవన్. కాగా రెండు రోజుల క్రితం పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ అగ్ని ప్రమాదం సంభవించడంతో మెగా ఫామిలీ మొత్తం కలత చెందింది. కాగా ఈ సమయంలో తన భాగం సినిమాకు సంబంధించి షూటింగ్లో పవన్ పాల్గొంటారో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దానితో ఒకింత నిర్మాత రత్నంకి దురదృష్టకర పరిస్థితి అని చెప్పాలి. 

READ  Good Bad Ugly not Devisriprasad Tunes 'గుడ్ బ్యాడ్ అగ్లీ' : దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ లేవా ?

దీనిని బట్టి పక్కాగా మే 9 రిలీజ్ హరిహర వీరమల్లు ఎంతవరకు ఆడియన్స్ ముందుకు వస్తుందనేది కొంత సందేహమే. మరోవైపు ఈ సినిమా యొక్క ఓటిటి హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వారు సినిమా యొక్క పోస్ట్ పోన్మెంట్ నిమిత్తం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. మరి హరహర వీరమల్లు ఎంతవరకు అనుకున్న డైట్ కి రిలీజ్ అవుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp

READ  Shabdam Unimpressive Horror Thriller 'శబ్దం' మూవీ రివ్యూ : అంతగా ఆకట్టుకోని హర్రర్ థ్రిల్లర్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories