పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు. అందాల నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సుబ్బరాజు, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి, అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు.
కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు ఏర్పరచిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న గ్రాండ్ లెవెల్ లో పలు భాషల ఆడియన్సు ముందుకి రానుంది.
అయితే విషయం ఏమిటంటే ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈనెల 20వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా భారీ స్థాయిలో నిర్వహించేందుకు టీమ్ అయితే సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఒక అనౌన్స్ మెంట్ కూడా హరిహర వీరమళ్లు టీం అందించింది.
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఈవెంట్ కి ప్రత్యేకంగా హాజరు కానున్నట్లు టాక్. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ అనంతరం ఎంత మేర అందర్నీ ఆకట్టుకుని ఏ స్థాయిలో విజయం అందుకుంటుందో చూడాలి.