పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, పూజిత పొన్నాడ, సత్యరాజ్, అనసూయ, సచిన్ ఖేడేకర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తుండగా ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ పై ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కొద్దిపాటి షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. త్వరలో తన పార్ట్ షూట్ కోసం పవన్ డేట్స్ కేటాయించనున్నారట. ముఖ్యంగా ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి మే 9న సమ్మర్ కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ మూవీ మే నెలాఖరుకి వాయిదా పడిందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్.
సినిమాకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా వేగంగా జరుగుతోందట. అయితే పక్కాగా హరి హర వీర మల్లు వాయిదా పడిందా లేదా అనేది టీమ్ నుండి అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఈ మూవీలో గజదొంగ వీరమల్లుగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.