టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న మూడు సినిమాల్లో హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హరి హర వీర మల్లు కూడా ఒకటి. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలకమైన పాత్రల్లో బాబీ డియోల్, పూజిత పొన్నాడ, అనసూయ, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి తదితరులునటిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ వాస్తవానికి మే 9న రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. మరోవైపు తన పార్ట్ బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేస్తానని పవన్ డేట్స్ కూడా కేటాయించారు. అయితే అనుకోకుండా పవన్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురికావడంతో షూట్ వాయిదా పడింది. దీనితో తమ అభిమాన హీరో మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో అనే విషయమై పవన్ ఫ్యాన్స్ అయోమయంలో ఉండిపోయారు.
ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి హరి హర వీర మల్లు మూవీ మే చివర్లో లేదా జూన్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని, త్వరలోనే పవన్ తన పార్ట్ షూట్ పూర్తి చేయనున్నారని అంటున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఏ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మరి పక్కాగా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియిలీ అంటే మేకర్స్ అఫీషియల్ గా న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి.