Homeసినిమా వార్తలు'హరి హర వీరమల్లు' న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ 

‘హరి హర వీరమల్లు’ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ 

- Advertisement -

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మొత్తం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దీనిని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ మొత్తం కూడా పవన్ పూర్తి చేశారు.

ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నర్గీస్ పక్రి, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని ఏఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా ఈ సినిమా యొక్క న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. దాని ప్రకారం హరిహర వీరమల్లు జూన్ 13న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అంటే సరిగ్గా మరొక నెల రోజుల్లో పవన్ సినిమా థియేటర్స్ లోకి రావడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

READ  'హరి హర వీర మల్లు' న్యూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ ?

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటిటి డీల్ అమెజాన్ ప్రైమ్ తో కుదిరినట్టు తెలుస్తోంది. ఇక హరిహర వీరమల్లు అనంతరం ఇప్పటికే ఓజీ షూట్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు పవన్. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో కూడా ఆయన పాల్గొననున్నారు. మొత్తంగా ఈ ఏడాది హరిహర వీరమల్లుతో పాటు ఓజి కూడా థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం గట్టిగా కనబడుతోంది. మరి పవన్ నుంచి రానున్న ఈ రెండు సినిమాలు ఏ స్థాయి విజయాలు అందుకుంటాయో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp

READ  హిట్ 3 : రూ. 100 కోట్ల దిశగా కొనసాగుతున్న కలెక్షన్ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories