పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్, జ్యోతికృష్ణ కలిసి తీసిన లేటెస్ట్ పాన్ ఇండియన్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా కీలక పాత్రల్లో సచిన్ ఖేడేకర్, బాబీ డియోల్, నాజర్, సునీల్, సత్యరాజ్ తదితరులు నటించారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం మూటగట్టుకుంది.
రిలీజ్ కి ముందు రోజు ప్రీమియర్స్ ద్వారా నెగటివ్ టాక్ ని మూటగట్టుకున్న హరి హర వీర మల్లు మూవీ ఫస్ట్ డే నుండి చాలా చోట్ల దారుణంగా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేసింది. పవన్ కెరీర్ లో కాస్ట్లీ ప్రాజక్ట్ గా రూపొందిన ఈ మూవీకి మొత్తంగా నిర్మాత ఏ ఎం రత్నం రూ. 300 కోట్ల బడ్జెట్ పెట్టారు.
కాగా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ మూవీకి మొత్తంగా రూ. 175 కోట్ల రూపాయలు మాత్రమే లభించడం జరిగింది. దానితో ఈ మూవీ వలన నిర్మాతకు రూ. 100 కోట్లకు పైగా నష్టాలు వాటిల్లాయి. దీనితో ఎంతో ఢీలా పడ్డ పవన్ ఫ్యాన్స్, తదుపరి ఆయన నుండి రానున్న ఓజి మూవీ పై ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకి రానుంది.