పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు. వాటిలో హరి హర వీర మల్లు మూవీ జూన్ 12న రిలీజ్ కి సిద్ధమైంది.
ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ పై ఏ ఎం రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తుండగా నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, అనసూయ, పూజిత పొన్నాడ, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్నారు.
ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ తప్పకుండా రిలీజ్ అనంతరం విజయం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ లో కొల్లగొట్టినాదిరో సాంగ్ బాగానే రెస్పాన్స్ అందుకుంది.
విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి త్వరలో ఒక మంచి మాస్ సాంగ్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. దీనిని ఒక ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేసి అనంతరం ట్రైలర్ తో పాటు వరుసగా పలు ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ఈ మూవీ జూన్ 12న రిలీజ్ అయి ఎంతమేర పవన్ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.