టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం కృష్ణ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న తాజా పీరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు ఫస్ట్ సాంగ్ మంచి రెస్పాన్స్ అయితే అందుకున్నాయి. త్వరలో సెకండ్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు టీమ్. కాగా విషయం ఏమిటంటే నేటి నుంచి హరిహర వీరమల్లు యొక్క లాస్ట్ షెడ్యూల్ మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ లో ఇతర ఆర్టిస్టులతో షూట్ చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్ షూట్ ని త్వరలో పూర్తి చేయనున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో మార్చి రెండోవారం కల్లా సినిమాకు సంబంధించిన వర్క్ అంతా పూర్తి చేసి మార్చి 28న సినిమాని థియేటర్స్ లో తీసుకొచ్చేందుకు నిర్మాత ఏ ఎం రత్నం ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కాగా తమ మూవీ ఆరోజున థియేటర్స్ లో ఉంటుందని ఆయన తాజాగా మరొకసారి స్పష్టం చేయడం జరిగింది.