పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇలాంటి చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఇప్పటివరకకూ విడుదలైన ఆయన లుక్, సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచాయి.
అయితే ఈ సినిమా షూటింగ్ పదే పదే ఆలస్యం కావడం, ఆ పైన కొన్ని రోజుల వరకూ చిత్ర బృందం నుంచి సినిమకి సంభంధించి ఎలాంటి అప్డేట్ రాకపోవడం పవన్ కళ్యాణ్ అభిమానుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఇది ఒక రకంగా సినిమా పైన కొంత అనుమానాలు వచ్చేలా చేశాయి.
అయితే ఈ సినిమా ఔట్ పుట్ పై చిత్ర యూనిట్ మాత్రం చాలా నమ్మకంగా ఉంది. ముఖ్యంగా దర్శకుడు క్రిష్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ టోటల్ పర్ఫెక్షనిస్ట్ అని అన్నారు.అంతే కాకుండా సినిమాలోని ప్రతి చిన్న సన్నివేశాన్ని స్థూలంగా తెలుసుకుని పని చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తారని క్రిష్ తెలిపారు.
ఇక హరి హర వీరమల్లు సినిమా యొక్క ఇంటర్వెల్ బ్లాక్ గురించి క్రిష్ చాలా గొప్పగా చెప్పారు. ఆ ఎపిసోడ్ ఏకంగా తన కెరీర్ లోనే బెస్ట్ గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు.
హరి హర వీరమల్లు కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల సమాహారంగా తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్, ఆదిత్య మీనన్, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.