Home సినిమా వార్తలు అంచనాలు పెంచేసిన ‘హరి హర వీర మల్లు’ ట్రైలర్

అంచనాలు పెంచేసిన ‘హరి హర వీర మల్లు’ ట్రైలర్

hari hara veera mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ పాన్ ఇండియన్ హిస్టారికల్ మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్స్, సాంగ్స్ తో పర్వాలేదనిపించే హైప్ ఏర్పరిచిన ఈ మూవీ నుండి నేడు థియేట్రికల్ ట్రైలర్ ని గ్రాండ్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎపిక్ చేయబడ్డ థియేటర్స్ లో రిలీజ్ చేసారు మేకర్స్.

ఇక యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ అయితే లభిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ వంటివి అందరినీ ఆకట్టుకుని ఇప్పటివరకు మూవీ పై అంచనాలు మరింతగా పెంచేసాయి.

జులై 24న హరి హర వీర మల్లు మూవీ గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి రానుంది. ఇంకా ఈ మూవీలో నాజర్, పూజిత పొన్నాడ, బాబీ డియోల్, అనసూయ భరద్వాజ్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version