పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న సినిమాల్లో భారీ పాన్ ఇండియన్ హిస్టారికల్ మూవీ హరి హర వీర మల్లు కూడా ఒకటి. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈమూవీని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సమ్యుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హరి హర వీర మల్లు నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ పెద్దగా ఆకట్టుకోనప్పటికీ సెకండ్ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది.
అలానే మూడు గ్లింప్స్ టీజర్స్ కూడా మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, తాజాగా తమ మూవీ యొక్క డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ నేడు ఒక అప్ డేట్ అందించారు. ఈ మూవీలో నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, పూజిత పొన్నాడ కీలక పాత్రలు చేస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం దీనిని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
కాగా అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీ మే 9న సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.