పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ కలయికలో క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు. జూలై 24న గ్రాండ్ గా పలుభాషల ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాని మెగా సూర్య ప్రొటెక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఇటీవల రిలీజైన టీజర్ ట్రైలర్ అలానే సాంగ్స్ తో మంచి అంచనాలు ఏర్పర్చిన ఈ సినిమా ముందు రోజు ప్రీమియర్స్ నుండి నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఫస్ట్ డే నుండి చాలా వరకు అదే టాక్ తో కొనసాగిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పూర్తిగా నిరాశపరిచింది.
ముఖ్యంగా మూవీలో నాసిరకమైన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి చాలా వరకు మైనస్ గా మారాయి. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, రెండు సాంగ్స్, కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నప్పటికీ ఓవరాల్ గా హరి హర వీర మల్లు బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం పూర్తిగా చతికల పడింది.
కాగా అసలు విషయం ఏమిటంటే, మొత్తంగా ప్రస్తుతం రూ. 103 కోట్ల గ్రాస్ రూ. 63 కోట్ల షేర్ తో భారీ డిజాస్టర్ దిశగా ఈ మూవీ కొనసాగుతోంది. అజ్ఞాతవాసి తరువాత మరొక్కసారి ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరొక డిజాస్టర్ గా నిలిచింది.