Homeసినిమా వార్తలుHari Hara Veera Mallu: గుర్రంపై దుసుకొచ్చి యుద్ధం చేస్తోన్న హరిహర వీరమల్లు..?

Hari Hara Veera Mallu: గుర్రంపై దుసుకొచ్చి యుద్ధం చేస్తోన్న హరిహర వీరమల్లు..?

- Advertisement -

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోండగా, పీరియాడికల్ ఎంటర్ టైనర్ సబ్జెక్టుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వీరమల్లు అనే ఫిక్షన్ పాత్రలో పవన్ నటిస్తుండగా, ఈ సినిమాలో ఆయన సరికొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు అదిరిపోయే క్రేజ్ లభించింది.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన వర్క్‌షాప్‌ను చిత్ర యూనిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో పవన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక, దర్శకుడు ఈ సినిమాలోని కొన్ని వార్ ఎపిసోడ్స్‌ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాడట.

ఈ వార్ సీక్వె్న్స్‌లో పవన్ కల్యాణ్ వీరమల్లుగా గుర్రం స్వారీ చేస్తూ యుద్ధరంగంలో కదం తొక్కే సీన్స్ అదిరిపోయేలా చిత్రీకరిస్తున్నారట. ఇక ఈ యాక్షన్ సీక్వె్న్స్‌లో పవన్ చేసే స్టంట్స్ అభిమానులను అవాక్కయ్యేలా చేస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తో పాటు అందాల భామ నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, అర్జున్ రామ్‌పాల్, సోనాల్ చౌహాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, ఏఎం.రత్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

READ  మెగా ఫ్యాన్స్ చేసిన దానికి తిరిగి ఇచ్చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories