అ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా హనుమాన్, టాలీవుడ్ తొలి ‘సూపర్ మ్యాన్’ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఈ సంవత్సరంలో చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న సినిమా. ఒక సామాన్యుడు ‘హనుమంతుడు’ యొక్క అద్భుత శక్తికి ఎలా సంపాదించాడు అనేది ఈ సినిమా కథ.
కాగా ఇటీవల శ్రీ రామ నవమి సందర్భంగా, చిత్ర నిర్మాతలు ప్రత్యేక పండగ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే హనుమాన్ చాలీసా యొక్క సూపర్ పవర్‌ఫుల్ రెండిషన్‌ను హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
టీజర్‌తో భారీ బజ్‌ను సృష్టించిన హనుమాన్ చిత్రం చాలా అంచనాలను కలిగి ఉంది మరియు మే 12న అంతర్జాతీయ మార్కెట్‌లలో కూడా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న తేదీకి రాకుండా వాయిదా పడుతుందని అంటున్నారు.
వీఎఫ్‌ఎక్స్‌లో ఇంకా అవ్వాల్సిన పనులు ఉండటమే ఈ వాయిదాకు కారణమని చెబుతున్నారు. దేవుడు మరియు సూపర్ పవర్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా ఉంటుంది కాబట్టి సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కి చాలా ప్రాముఖ్యత ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.