తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకూ కాకపోయినా తమిళ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ గా అవతరిస్తున్నారు. వారిసు బడ్జెట్‌లో ఈ విజయ్ పారితోషికం దాదాపు 50% తీసుకున్నారని సమాచారం. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో విజయ్ 125 కోట్లను తన ఖాతాలో జమ చేసుకున్నట్లు తెలుస్తోంది.
కేవలం ఒకే భాషలో ఎక్కువ కాలం ఉన్న స్టార్‌కి ఈ రకమైన రెమ్యూనరేషన్ అనేది నిజంగా ఊహించనిదే. కాగా విజయ్ తన తెలుగు మార్కెట్‌ను ఈ మధ్యే అభివృద్ధి చేస్తున్నారు. ఆయన నటించిన చాలా సినిమాలను ప్రపంచవ్యాప్తంగా తమిళ ప్రజలు ఎంతో ఇష్టంగా చూశారు. ఇది తమిళ ప్రజలలో ఆయనకు ఉన్న అసమానమైన క్రేజ్‌ని తెలియజేస్తుంది.
విజయ్ తాజాగా నటిస్తున్న సినిమా వారిసు. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయడంలో మంచి పేరున్న వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు నిర్మించారు. ఇంత భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ, నిర్మాతలు విజయ్ కాల్ షీట్స్ కోసం క్యూలో ఉన్నారు.
దళపతిగా అభిమానుల చేత పిలిపించుకునే ఈ స్టార్ హీరో చేతిలో తదుపరి మరింత క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల నిర్వహణలో రాబోతున్న ఆయా సినిమాలకు కూడా పారితోషికంగా ఆయనకు భారీ మొత్తాన్ని చెల్లించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. వారిసుతో తెలుగు రాష్ట్రాల్లోనూ మార్కెట్ ము మరింత బలంగా మార్చుకొనున్నారు విజయ్.
సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రష్మిక కథానాయికగా నటిస్తుండగా, తమన్ సంగీత దర్శకుడు. జనవరి 12న అదే రోజున వీరసింహారెడ్డితో పాటు తెలుగులో వారసుడు పేరుతో ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదల మరియు థియేటర్ల కేటాయింపుకు సంబంధించి ఈ మధ్య కొంత వివాదానికి గురైంది, అయితే ప్రేక్షకులు ఈ రచ్చను పట్టించుకోవడం లేదు, తమిళ డబ్బింగ్ సినిమా అయినా లేదా స్ట్రెయిట్ అయినా మంచి కంటెంట్ కోసం మాత్రమే వారు చూస్తారు.