నేడు ఆగష్టు 15న అటు రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ తో పాటు ఇటు రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ మూవీస్ రెండూ కూడా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. మొదటి నుండి మంచి అంచనాలు కలిగిన ఈ రెండు మూవీస్ నేడు ఆడియన్స్ ముందుకి వచ్చి ఫైనల్ గా డిజప్పాయింట్ చేసాయి.
ముఖ్యంగా గురుశిష్యులైన పూరి, హరీష్ ఇద్దరూ కూడా తమ రొట్ట టేకింగ్ తో థియేటర్స్ లో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టారు. రీమేక్స్ ని తెరకెక్కించడంలో మంచి పేరు కలిగిన హరీష్ శంకర్, మిస్టర్ బచ్చన్ మూవీని దారుణంగా తీసారని చెప్పాలి.
ముఖ్యంగా హీరోయిన్ గ్లామర్ మీద పెట్టిన దృష్టి స్టోరీ, స్క్రీన్ ప్లే మీద పెట్టలేదు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ అయితే ఆడియన్స్ కి టార్చర్. ఇక డబుల్ ఇస్మార్ట్ ని కూడా పూరి అదేవిధంగా తీశారు. ఫస్ట్ హాఫ్ లో అక్కడడక్క పర్వాలేదనిపించే సీన్స్, సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, రామ్ యాక్టింగ్ తప్ప మూవీలో ఏమి లేదు. ప్రేక్షకాభిమానుల ఆశల పై పూర్తిగా నీళ్లు జల్లిన గురుశిష్యులు మొత్తంగా అందరినీ ఎంతో షాక్ కి గురిచేసారు. అయితే మొత్తంగా రెండింటిలో డబుల్ ఇస్మార్ట్ కొద్దిగా బెటర్ అని చెప్పుకోవచ్చు.