సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ముందు రోజు బెనిఫిట్ షోస్ కి నెగటివ్ టాక్ మూటగట్టుకున్న ఈ మూవీలో రమణ గాడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించింది.
అయితే కంటెంట్ పెద్దగా ఆకట్టుకోనప్పటికీ మహేష్ బాబు స్టార్డం గుంటూరు కారం మూవీకి బాగా వర్క్ చేసింది. దాదాపుగా పలు ప్రాంతాల్లో బ్రేకివెన్ సాదించిన ఈ మూవీ ఇటీవల అటు నెట్ ఫ్లిక్స్ ఓటిటి లో కూడా బాగా రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక కొన్నాళ్ల క్రితం తెలుగు టివి ఛానల్ జెమినీలో ఫస్ట్ టైం ప్రసారం అయిన గుంటూరు కారం మూవీ 9 రేటింగ్ ని సంపాదించుకోగా తాజాగా సెకండ్ టైం ప్రసారం అయి 6.13 రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఇక అదేరోజున ప్రసారం అయిన బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ కి కేవలం 4.45 రేటింగ్ మాత్రమే లభించింది.
నిజానికి థియేటర్స్ లో రిలీజ్ సమయంలో గుంటూరు కారం పై పలువురు కావాలని పని గట్టుకుని నెగటివ్ రేటింగ్స్, రివ్యూస్ ఇచ్చినప్పటికీ మహేష్ బాబు స్టార్డం తో మూవీ బాగానే కలెక్షన్ రాబట్టడంతో పాటు టివి ప్రీమియర్స్ లో కూడా అందరినీ అలరించి మంచి రేటింగ్స్ కూడా సంపాదించడం పెద్ద ట్విస్ట్ అంటున్నాయి సినీ వర్గాలు. మొత్తంగా మహేష్ స్టార్డం యొక్క పవర్ కి ఇది నిదర్శనం అని వారు కొనియాడుతున్నారు.