Home సినిమా వార్తలు Good Response for Thandel Bujji Thalli Song ‘తండేల్’ : మంచి రెస్పాన్స్ అందుకుంటున్న...

Good Response for Thandel Bujji Thalli Song ‘తండేల్’ : మంచి రెస్పాన్స్ అందుకుంటున్న బుజ్జి తల్లి సాంగ్

thandel

యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా అందాల నటి సాయిపల్లవి హీరోయిన్ గా యువదర్శకుడు చందు ఉండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న తాజా యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ఈ మూవీ పై మొదటి నుంచి అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ఇటీవల తండేల్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ గాని ఫస్ట్ గ్లింప్స్ గాని అందర్నీ కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి బుజ్జి తల్లి అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ మెలోడీ సాంగ్ అందర్నీ కూడా ప్రస్తుతం ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యూట్యూబ్ లో ఈ సాంగ్ కి ప్రస్తుతం బాగానే వ్యూస్ లభిస్తున్నాయి. ఇక ఈ మెలోడియస్ సాంగ్ ని శ్రీమణి రచించగా జావేద్ ఆలీ అద్భుతంగా పాడారు.

మొత్తంగా ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ ఉండటంతో తండేల్ యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సాంగ్ ని ఎంతో అద్భుతంగా కంపోజ్ చేశారు. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఫిబ్రవరి 7న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు అయితే తీసుకురానున్నారు. మరి రిలీజ్ అనంతరం తండేల్ మూవీ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version