మెగా ఫ్యాన్స్ కి రానున్న రోజుల్లో వీనులవిందైన సినిమాలు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ముందుగా రానున్న డిసెంబర్ 6న పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప 2 మూవీ గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
అనంతరం డిసెంబర్ 20న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ ల క్రేజీ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ట ల సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర ఆడియన్స్ ముందుకి రానుంది.
ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా యువి క్రియేషన్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మొత్తంగా రెండు నెలల గ్యాప్ లో రానున్న ఈ మూడు క్రేజీ ప్రాజక్ట్స్ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో భారీ అంచనాలున్నాయి. మరి వీటిలో ఏ సినిమా ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.