ఇటీవల మగిల్ తిరుమేణి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడాముయార్చి ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్. అయితే రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏమాత్రం ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
దాని అనంతరం తాజాగా అజిత్ చేస్తున్న మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, తాజాగా వచ్చిన గ్లింప్స్ టీజర్ తో మూవీ పై అందరిలో మంచి అంచనాలు అయితే ఏర్పడ్డాయి.
కాగా గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ ఫిబ్రవరి 28న విడుదల కానుంది. విషయం ఏమిటంటే ఈ టీజర్ యొక్క నిడివి 94 సెకండ్లు అనగా 1 నిమిషం 34 సెకండ్స్ ఉండనుండగా తప్పకుండా ఈ టీజర్ రిలీజ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పరచడం ఖాయమని టీమ్ అంటోంది. అలానే రిలీజ్ అనంతరం గుడ్ బ్యాడ్ అగ్లీ విజయం ఖాయమని యూనిట్ అయితే ఆశాభావం చేస్తుంది.
అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని యువ దర్శకుడు అధిక రవిచంద్రన్ తెరకెక్కిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్, రాహుల్ దేవ్, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఏప్రిల్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.