తాజాగా అజిత్ హీరోగా యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ గుడ్ బాడ్ అగ్లీ. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా అర్జున్ దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్ సహా పలువురు ఇతర ముఖ్య నటులు కీలకపాత్రల్లో కనిపించారు.
అయితే ఇటీవల రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆడియన్స్ నుంచి పర్వాలేదనిపించే టాక్ సంపాదించిన ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్ ని అయితే విశేషంగా ఆకకట్టుకుంటోంది. ముఖ్యంగా అజిత్ ఫ్యాన్స్ అయితే తమ అభిమాన నటుడిని ఎలా చూడాలని భావించామో ఆ విధంగా దర్శకుడు ప్రజెంట్ చేశారని చెప్తున్నారు.
ముఖ్యంగా ఇందులోని యాక్షన్, ఎలివేషన్ సన్నివేశాలు అలానే ఫొటోగ్రాఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ దాటి బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది.
ముఖ్యంగా తమిళనాడులో గుడ్ బ్యాడ్ అగ్లీ బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. అయితే ఇది అజిత్ స్టార్డం స్థాయి కలెక్షన్ కాదని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఇటీవల ఇళయదలపతి నటించిన గోట్ సినిమా రూ. 450 కోట్లు సొంతం చేసుకుంది. కాగా గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రస్తుత బాక్సాఫీస్ పరిస్థితిని బట్టి చూస్తే ఇది ఓవరాల్ గా రూ. 250 కోట్ల క్లోజింగ్ తోనే ముగిసే అవకాశం ఉంది.
దానినిబట్టి అటు విజయ్ ఇటు అజిత్ మధ్య రెండు వందల కోట్లు గ్యాప్ రావడంతో అజిత్ సినిమా ఇంకా బాగా పెర్ఫామ్ చేసి ఉండాల్సిందని, దర్శకుడు మరింత అద్భుతంగా సినిమా యొక్క కథనం తెరకెక్కించి ఉంటె ఖచ్చితంగా ఈ మూవీ కూడా మరింతగా రాబట్టి ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. మరి అజిత్ నుంచి రాబోయే సినిమాలు ఏ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి.