ఇటీవల విడాముయార్చి వచ్చి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ ఆ సినిమాతో డిజాస్టర్ చవిచూశారు. ఇక ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో త్రిష హీరోయిన్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చేస్తున్నారు అజిత్.
ఈ సినిమాపై అజిత్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న ఈ మూవీ గ్రాండ్ లెవెల్ లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ తో ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసిందని చెప్పాలి.
విషయం ఏమిటంటే వాస్తవానికి ఈ సినిమాకి మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ని అనౌన్స్ చేశారు. అయితే పుష్ప 2 కి సంబంధించిన వర్క్ పెండింగ్ ఉండటంతో ఆయన సినిమా నుంచి తప్పుకోగా ఆ స్థానంలో జీవి ప్రకాష్ కుమార్ ని తీసుకున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని ట్యూన్స్ ని దేవిశ్రీ అందించారనేది అప్పట్లో వచ్చిన టాక్.
ఇక జీవి ప్రకాష్ కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారనే పుకార్లు కూడా ప్రచారం అయ్యాయి. కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ రెండూ అందిస్తున్నట్లు చెప్తున్నారు. అలానే దేవిశ్రీ ఈ సినిమాకి ఒక ట్యూన్ కూడా ఇవ్వలేదని ఆయన్ని రీప్లేస్ చేసిన అనంతరం జీవి ప్రకాష్ వర్క్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి సంబంధించి ఫుల్ వర్క్ స్టార్ట్ చేశారని చెప్తున్నారు.
ఇక గుడ్ బాయ్ అగ్లీ మూవీ యొక్క సాంగ్స్ ఒక్కొక్కటిగా త్వరలో రిలీజ్ కానున్నాయి. మరి ఓవరాల్ గా అందరిలో బాగా హైపర్ ఏర్పరిచిన ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు.