కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీని ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ పర్వాలేదనిపించగా తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఎక్కువగా ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ మాత్రమే ట్రైలర్ లో ఫోకస్ చేసారు. ఇక ఈ మూవీ పై అజిత్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సెన్సార్ బోర్డు వారు యు / ఏ సర్టిఫికెట్ ని అందించారు. ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 19 నిమిషాల 23 సెకన్లు. మొదటి అర్ధ భాగం 1 గంట 15 నిమిషాల 46 సెకన్లు, రెండవ అర్ధ భాగం 1 గంట 3 నిమిషాల 37 సెకన్లు.
గుడ్ బ్యాడ్ అగ్లీ యొక్క FDFS టైమింగ్స్ వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి :
- తమిళనాడు—ఉదయం 9 గంటలు
- కర్ణాటక—ఉదయం 8:30 గంటలు
- కేరళ—ఉదయం 9 గంటలు
- ఏపీ / తెలంగాణ—ఉదయం 9 గంటలు
- విదేశాలలో—ఉదయం 4 గంటలు IST
అర్జున్ దాస్, షైన్ టామ్ చాకో, BS అవినాష్, ప్రభు, ప్రసన్న, రాహుల్ దేవ్, యోగి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన గుడ్ బ్యాడ్ అగ్లీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుని మంచి విజయం అందుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి మరొక నాలుగు రోజుల్లో అనగా ఏప్రిల్ 10న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ఏ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.