అజిత్ హీరోగా యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన తన లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించగా దీనిని తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ లెవెల్ లో భారీ వ్యయంతో నిర్మించారు.
అజిత్ మాస్ యాక్టింగ్ తో పాటు పవర్ఫుల్ యాక్షన్ ఎలివేషన్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓవరాల్ గా మొదటి రోజు మంచి టాక్ ని సంపాదించుకున్న ఈ సినిమా తమిళనాడులో ఓపెనింగ్ రోజున రూ. 30 కోట్లు అలానే ఆలిండియా పరంగా రూ. 35 కోట్లు సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో రెండు మిలియన్లు సంపాదించింది.
ఈ విధంగా టోటల్ వరల్డ్ వైడ్ ఓపెనింగ్ పరంగా ఈ సినిమా రూ. 52 నుంచి రూ. 53 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది. నిజానికి ప్రమోషనల్ కార్యక్రమాలు మరింత బాగా చేసి ఉంటే గుడ్ బ్యాడ్ అగ్లీ మరింత గ్రాండ్ గా ఓపెనింగ్స్ అందుకునేది. ఈ సినిమా అటు తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల్లో కూడా బాగానే ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.
అజిత్ ఫ్యాన్స్ అద్భుతంగా ఉందని చెబుతున్న ఈ సినిమాకి సాధారణ ఫ్యాన్స్ నుంచి మాత్రం యావరేజ్ టాక్ అయితే లభిస్తోంది. మరి ఈ వీకెండ్ లో ఈ సినిమా ఎంత మేర రాబడుతుందో ఓవరాల్ గా ఏ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేస్తుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి