Homeసినిమా వార్తలుఅడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకెళ్తున్న 'కింగ్డమ్' 

అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకెళ్తున్న ‘కింగ్డమ్’ 

- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కింగ్డమ్. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తుండగా కీలక పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారు.

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ యొక్క సాంగ్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

రేపు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ యొక్క ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ కాగా అటు అమెరికాతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ బాగా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ యొక్క ప్రీ బుకింగ్స్ రూ. 15.5 కోట్లకు చేరుకోగా, మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుంటే మొదటి రోజు రూ. 35 కోట్ల మేర రాబట్టే అవకాశం కనపడుతోంది.

READ  విశ్వంభర, ఘాటీ రిలీజ్ పై ఉత్కంఠ 

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్న కింగ్డమ్ తప్పకుండా మానవహి విజయం అందుకుని హీరోగా విజయ్ కు మంచి బ్రేక్ ని అందిస్తుందని టీమ్ ఆశాభవం వ్యక్తం చేస్తోంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories