Homeసినిమా వార్తలుమెగాస్టార్ చిరంజీవి - సల్మాన్ ఖాన్ తో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న గాడ్ ఫాదర్...

మెగాస్టార్ చిరంజీవి – సల్మాన్ ఖాన్ తో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న గాడ్ ఫాదర్ చిత్ర బృందం

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన భారీ స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. మొన్నటి వరకు ఈ సినిమాకు కాస్త ప్రతికూల వాతావరణం ఉండింది. కానీ నిన్న జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ తో మెగాస్టార్ చిరంజీవి అందరి అంచనాలను ఒక్కసారిగా మార్చేశారు.

కాగా గాడ్ ఫాదర్ చిత్ర నిర్మాతలు.. మెగాస్టార్ చిరంజీవి మరియు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌లను కలిపి ఒక భారీ ఈవెంట్ లో పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారట. నిన్న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. మెగాస్టార్ మరియు సల్మాన్ ఖాన్ కలిసి నటించిన సన్నివేశాలు నెటిజన్లకు ఎంతగానో నచ్చాయి. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో చిరంజీవి, సల్మాన్ లు కలిసి ఉన్న ఒక ఫైట్ బిట్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇప్పుడు అక్టోబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాకు పాజిటివ్ బజ్‌ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో గాడ్‌ఫాదర్ నిర్మాతలు ఈ ప్రమోషనల్ ఈవెంట్ ను భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇది మెగా అభిమానులతో పాటు బాలీవుడ్‌లోని సల్మాన్ ఖాన్ అభిమానులకు కూడా పండగే అని చెప్పాలి.

READ  లూసిఫర్ కి గాడ్ ఫాదర్ కి చాలా తేడా ఉంటుంది: సత్యదేవ్

గాడ్ ఫాదర్ సినిమాకి మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. ఒరిజినల్‌లో పృథ్వీరాజ్ అతిధి పాత్రలో నటించగా, ఇక్కడ ఆ పాత్రను సల్మాన్ ఖాన్ పోషిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సముద్రఖని, మురళి శర్మలు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ను నటింప జేయడం వలన సినిమాకు మరింత స్టార్ వాల్యూ జోడించడానికి ఉపయోగపడింది.

కాగా గాడ్ ఫాదర్ సినిమా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసింది. ఇక డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 57 కోట్ల రూపాయలను చెల్లించి కైవసం చేసుకుంది. ఈ చిత్రం మలయాళం మరియు హిందీలో కూడా డబ్బింగ్ వెర్షన్‌లలో విడుదల కానుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  మలయాళంలోనూ విడుదల కానున్న గాడ్ ఫాదర్.. అందరినీ ఆశ్చర్యపరిచిన మెగాస్టార్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories