Home సినిమా వార్తలు మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న గాడ్ ఫాదర్ సినిమా పబ్లిసిటీ

మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న గాడ్ ఫాదర్ సినిమా పబ్లిసిటీ

Mega Fans Are Worrying About Megastar's Next Release Godfather

తెలుగు చిత్రసీమలో అత్యంత ప్రభావవంతమైన నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. దాదాపు ముప్పై ఏళ్లకు పైగా ఎన్నో గొప్ప సినిమాలు చేస్తూ ఆయన ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి ఆయన స్థాయికి తగ్గ సినిమాలు కాకుండా చాలా సులువుగా మరిచిపోయే సాధారణ సినిమాలను అందిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలే ఆయన తన తనయుడితో నటించిన ఆచార్య ఏ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచిందో తెలిసిందే. ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ ఇమేజ్ కాస్త ప్రమాదంలో పడిందనే చెప్పాలి. అయితే, సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉన్నా, ఇతర నటీనటులు, దర్శకులు ఎవరూ అన్నదాంతో సంబంధం లేకుండా, చిరంజీవి సినిమాలు ఎల్లప్పుడూ బాక్సాఫీస్ వద్ద భారీగా ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించడం ఆనవాయితీ. ఖైదీ.నో.150 మరియు సైరా రెండూ గొప్ప ఓపెనింగ్స్‌ని సాధించాయి.

అయితే ఇప్పుడు అలా అలవోకగా ఓపెనింగ్స్ రాబట్టడం మెగాస్టార్‌కి కాస్త కష్టంగానే కనిపిస్తోంది. దీనికి ఉదాహరణ ఆచార్య సినిమానే, ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ముఖ్య పాత్ర పోషించడంతో పాటు స్టార్ దర్శకుడు కొరటాల శివను కాంబినేషన్లో వచ్చినా, భారీ ఓపెనింగ్‌ను పొందడంలో విఫలమై టాలీవుడ్‌లో డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా బాగోలేక పోతే ఏ హీరో నటించినా సినిమా ఆడదు. కానీ ఆచార్య సినిమా కనీస స్థాయిలో మాత్రమే ఓపెనింగ్స్ ను సాధించగలిగింది. అందుకు కారణం సినిమా మీద అటు మెగా అభిమానులలో ఇటు ప్రేక్షకుల్లో ఆచార్య సినిమా మీద ఏమాత్రం ఆసక్తి లేకపోవడమే.

ఇక, చిరంజీవి తాజాగా నటించి విడుదలకి సిద్ధంగా ఉన్న గాడ్ ఫాదర్ గురించి మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రొడక్షన్‌ సంస్థలు రెండు ఉన్నా కూడా, వారు ఈ సినిమాను సరైన విధంగా ప్రమోట్ చేయలేకపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకు రావాల్సిన బ‌జ్ రాలేదు. కాగా ఇటీవలే విడుదలైన గాడ్‌ఫాదర్ టీజర్ కూడా చాలా యావరేజ్‌గా ఉందనే టాక్ తెచ్చుకుంది. పైగా లాస్ట్ షాట్ లో ఉన్న VFX మరీ నాసిరకంగా ఉండి ట్రోల్స్ కు గురైంది.

గాడ్‌ ఫాదర్ సినిమా విడుదలకు కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉన్నందున, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత కాలంలో ఎలాంటి సినిమా అయినా సరైన ప్రచారం జరుపుకొలేకపోతే, ఆ సినిమాకు ప్రేక్షకుల్లో బజ్ ఏర్పడటం చాలా కష్టం. ఒకవేళ అలా సినిమాకి క్రేజ్ రాకపోతే బాక్సాఫీస్ దగ్గర చాలా తక్కువ ఓపెనింగ్స్ రావడం ఖాయం. గాడ్ ఫాదర్ సినిమాని సరిగా ప్రమోట్ చేయకపోతే ఆ సినిమాలో ఆచార్య కంటే తక్కువగా ఓపెనింగ్స్ వస్తాయేమో అని కొంతమంది మెగా అభిమానులు భావిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version