Home సినిమా వార్తలు హిందీలో విడుదల చేసుంటే జిన్నా 100 కోట్లు కలెక్ట్ చేసేది – మంచు విష్ణు

హిందీలో విడుదల చేసుంటే జిన్నా 100 కోట్లు కలెక్ట్ చేసేది – మంచు విష్ణు

Ginna Would Have Collected 100 Crores In Hindi Says Vishnu Manchu

మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి కనీస స్థాయిలో కూడా ధియేటర్లలో సందడి కనిపించలేదు. మంచు వారి సినిమాలను చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పూర్తిగా తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. ఇక గతంలో మంచు విష్ణు కూడా చాలా ట్రోల్స్‌కు గురయిన సంగతి తెలిసిందే. తాజాగా జిన్నా సినిమా విడుదలైన నేపథ్యంలో మరో సారి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయ్యారు.

అయితే ఎన్ని సార్లు ట్రోల్ అయినా మళ్ళీ మళ్ళీ హాస్యాస్పదమైన, వాస్తవానికి దూరమైన వ్యాఖ్యలు చేయడం మంచు విష్ణుకి అలవాటు. అలాగే తాజాగా మరోసారి తన పై జరుగుతున్న ట్రోలింగ్‌ను మరింత పెంచేలా మంచు విష్ణు మరో అత్యుత్సాహామైన వ్యాఖ్య చేశారు. విష్ణు తన ఒక ఇంటర్వ్యూలో, “జిన్నా సినిమాని హిందీలో విడుదల చేస్తే 100 కోట్లు వసూలు చేసేది” అని చెప్పారు. సింగిల్ డిజిట్ షేర్లు కూడా వసూలు చేయలేక ఇబ్బంది పడుతున్న ఒక నటుడు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు, ట్రోలింగ్ కావడం అనేది చాలా సబబు అని సమర్థించవచ్చు.

కాగా మంచు విష్ణు అంతటితో ఆగలేదు.. తన పాత సూపర్ హిట్ సినిమా అయిన ఢీ సినిమా సమయం నుండి, తనకు ఎప్పుడూ హిందీలో బలమైన అభిమానుల సంఖ్య ఉందని కూడా అనడం అతిశయోక్తి కాక మరేమీ కాదు. తన దూసుకెళ్తా, దేనికైనా రెడీ వంటి సినిమాలు హిందీలో తన స్టార్‌డమ్‌ని పెంచాయని విష్ణు పేర్కొన్నారు. “నా చిత్రం డైనమైట్ సోనీ మ్యాక్స్‌లో అత్యధిక టీఆర్‌పీలను సాధించింది. ఇది ఏ సినిమాకైనా అత్యధికం” కూడా అన్నారు.

నిజానికి యూట్యూబ్ లో మన తెలుగు సినిమాల తాలూకు డబ్బింగ్ వెర్షన్లు హిట్ ఫ్లాప్ లకు అతీతంగా ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటాయి. అలా అని చెప్పి దాన్ని బలమైన మార్కెట్ కింద పరిగణిస్తే అది భారీ పొరపాటు అవుతుంది.

ఇలా వరుసగా హాస్యాస్పద వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు.. నార్త్‌లో తనకున్న మార్కెట్‌ కారణంగా తెలుగు సినిమా చేసి డబ్బింగ్‌ చేసి హిందీలో విడుదల చేయాలని తన స్నేహితులు ఎప్పుడూ వెక్కిరించేవారని అన్నారు. ప్రస్తుతం థియేటర్లలో జిన్నా పరిస్థితి చూస్తుంటే విష్ణు మంచు భ్రమపడుతున్నారో లేక మనం అంధులమో తెలియని అయోమయంలో ఉన్నామని చెప్పవచ్చు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version