Home సినిమా వార్తలు పవర్ఫుల్ గా ‘ఘాటీ’ ట్రైలర్

పవర్ఫుల్ గా ‘ఘాటీ’ ట్రైలర్

ghaati

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో హృద్యమైన సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ఘాటీ. ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ పర్వాలేదనిపించే రెస్పాన్స్ అందుకున్నాయి.

కాగా నేడు ఈమూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ముఖ్యంగా ట్రైలర్ లో అనుష్క శెట్టి పవర్ఫుల్ లుక్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఘాటీ గా తన జీవిత ప్రయాణం సాగించే ఒక మహిళ అనంతరం తద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కోవడం, బాధితురాలిగా మారడం, ఆపై చివరకు శత్రువులని ఏవిధంగా మట్టుపెట్టింది అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది.

ఇక ట్రైలర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. మొత్తంగా ఘాటీ ట్రైలర్ ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు మరింతగా పెంచిందని చెప్పాలి. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version