Homeసినిమా వార్తలు'ఘాటీ' సెన్సార్ & రన్ టైం డీటెయిల్స్

‘ఘాటీ’ సెన్సార్ & రన్ టైం డీటెయిల్స్

- Advertisement -

స్టార్ నటి అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఘాటీ. ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ పర్వాలేదనిపించే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అయితే ఈ మూవీలో అనుష్క యాక్టింగ్ ఆకట్టుకుంటుందని, ఆమె ఈ పాత్రలో ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారని టీమ్ చెప్తోంది.

చైతన్యరావు మదాడి, జగపతి బాబు, జాన్ విజయ్, జిషు సేన్ గుప్తా వంటి వారు కీలక పాత్రలు చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్సు ముందుకి రానుంది. అయితే విషయం ఏమిటంటే, తాజాగా సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ U/A స‌ర్టిఫికెట్ అందుకుంది. ఇక ఈ మూవీ ర‌న్ టైమ్‌ 2 గంట‌ల 35 నిమిషాలు కాగా ఫ‌స్టాఫ్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీసెకండాఫ్ ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్‌ తో సాగుతుందట.

READ  'వార్ - 2' కి భారీ రన్ టైం ?

ఇక క్రిష్‌, అనుష్క‌ ఇద్ద‌రికీ ఇది బెస్ట్ క‌మ్ బ్యాక్ అవుతుంద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. మరి రిలీజ్ అనంతరం ఘాటీ ఎంతమేర విజయవంతం అవుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories