Home సినిమా వార్తలు గాార్గి ట్రైలర్: మరో ఆసక్తికరమైన కథతో రాబోతున్న సాయి పల్లవి

గాార్గి ట్రైలర్: మరో ఆసక్తికరమైన కథతో రాబోతున్న సాయి పల్లవి

సాయి పల్లవి నటించిన కొత్త సినిమా’గార్గి’. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను  తెలుగులో రానా ప్రెజెంటర్ గా వ్యవహరిస్తుండగా తమిళంలో సూర్య, జ్యోతిక రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ మరియు టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హీరోలు రానా, నాని తమ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి సాయి పల్లవికి తమ అభినందనలు తెలిపారు. ట్రైలర్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. “మేడమ్.. మీరు బ్రహ్మానందం పెద్ద కూతురు కదా”అంటూ మీడియా అడిగే ప్రశ్నలతో ట్రైలర్ మొదలైంది.

సెక్యూరిటీ గార్డు గా పనిచేసే బ్రహ్మానందం కు ఇద్దరు కూతుళ్లు.. అందులో పెద్ద కూతురు గార్గి(సాయిపల్లవి) టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. త్వరలోనే ఆమెకు పెళ్లి కూడా జరగబోతుండగా సడెన్ గా పోలీసులు బ్రహ్మానందం ను అరెస్ట్ చేస్తారు. కేసు ఏంటి..? అసలు అతను నేరం చేశాడా..? చేస్తే ఆ నేరం ఎంటి? అనేది ఆకుటుంబంలో ఎవరికి తెలియదు. దీంతో తండ్రి కోసం గార్గి చేసిన పోరాటమే .సినిమా కథగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.ఇంతకీ సాయి పల్లవి తండ్రి చేసిన ఆ తప్పు ఏంటీ..? ఒక్కరోజులోనే గార్గి జీవితాన్ని తలకిందులు చేసింది ఎవరు..? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటిగా సాయి పల్లవి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరైన పాత్ర దక్కటమే ఆలస్యం సాయి పల్లవి అద్భుతంగా నటిస్తారు అనేది రుజువైన విషయమే. ఆవిడ ఇదివరకు నటించిన సినిమాలు.. చేసిన పాత్రలే అందుకు ఉదాహరణ. ఇక ఈ ట్రైలర్ కు గోవింద్ వసంత్ అందించిన నేపధ్య సంగీతం హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. ఇక చివర్లో “నన్ను నమ్మవు అమ్మ నువ్వు.. ఎందుకంటే నేను మగపిల్లాడిని కాదు కదా.. ఆడపిల్లను” అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్ ఈ సినిమా ఎంతటి భావోద్వేగమైన కథతో రూపొందించబడిందో చెప్పకనే చెప్తుంది. ట్రైలర్ వరకు ఆకట్టుకున్న గార్గి .. వచ్చే వారం అంటే జూలై 15న థియేటర్లలో కూడా అంతే బలంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version