మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని శంకర్ తెరకెక్కిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు, కాగా దీనిని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
ఇందులో ఐఏఎస్ అధికారి రామ్ నందన్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీనిని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. దీనిని డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు.
కాగా ఈ రెండు సినిమాల యొక్క రిలీజ్ లకు రెండు వారల గ్యాప్ ఉండనున్నట్లు టాక్. ఒకరకంగా ఇది రెండు సినిమాల మధ్య కొద్దిపాటి గ్యాప్ తో వచ్చే క్లాష్ అని చెప్పాలి. మరి ఈ రెండు భారీ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఏది ఏ స్థాయి విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి.