మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా హీరోగా చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కితుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి అందరిని ఆకట్టుకుని యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ లో నేటితో తన పాత్ర యొక్క షూటింగ్ కి ప్యాకప్ చెప్పనున్నారు చరణ్. ఆపైన కేవలం కొంత పార్ట్ మాత్రమే షూట్ మిగిలి ఉందట.
దాని అనంతరం ఇతర కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా పూర్తి చేసేలా యూనిట్ ప్లాన్ చేస్తోందట. అనంతరం వరుసగా మిగతా సాంగ్స్, టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ వంటివి ఒక్కొక్కటిగా జరుపనున్నారని, ఈ ఏడాదే ఈ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.