Homeసినిమా వార్తలుGame Changer Update 'గేమ్ ఛేంజర్' లో ఆ అంశాలు కూడా ఉంటాయి : డైరెక్టర్...

Game Changer Update ‘గేమ్ ఛేంజర్’ లో ఆ అంశాలు కూడా ఉంటాయి : డైరెక్టర్ శంకర్

- Advertisement -

స్టార్ యాక్టర్ గ్లోబల్ స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న గేమ్ ఛేంజర్ ని ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాగా తాజాగా తాను తెరకెక్కించిన భారతీయుడు 2 ప్రమోషన్స్ లో భాగంగా గేమ్ ఛేంజర్ గురించి దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, ఈ మూవీలో పొలిటికల్ అంశాలతో పాటు మంచి మాస్ యాక్షన్ అంశాలు కూడా ఉంటాయని అన్నారు.

రామ్ చరణ్ తన పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నారని, కథకుడు కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథ కూడా ఎంతో బాగుందని, మొత్తంగా తామందరం ఎంతో కష్టపడుతున్న ఈ మూవీ మంచి విజయం అందుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు శంకర్.

READ  Mahesh Babu New Look SSMB 29 : మహేష్ బాబు పవర్ఫుల్ లుక్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories