మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో దీనిని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న గేమ్ ఛేంజర్ ని ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇటీవల కమల్ తో తీసిన భారతీయుడు 2 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన శంకర్ ఆ మూవీతో డిజాస్టర్ చవిచూశారు, దానితో రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా గేమ్ ఛేంజర్ పై ఒకింత భయం నెలకొంది. అయితే ఈ మూవీ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.
ముఖ్యంగా యువ దర్శకుడు కథకుడు అయిన కార్తీక్ సుబ్బరాజ్ దీనికి కథని అందించడంతో పాటు పొలిటికల్ యాక్షన్ అలానే భారీ మాస్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఇందులో ఉండడమే అంటున్నారు. ఆ సీన్స్ చరణ్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటాయట. మొత్తంగా తమ టీమ్ మొత్తం ఎంతో కష్టపడుతున్న గేమ్ ఛేంజర్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.