టాలీవుడ్ స్టార్ నటుడు మెగాపవర్ స్టార్ గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్.
ఈ మూవీలో ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెనకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై దిల్ రాజు భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకోగా ఈ అక్టోబర్ నెలలో మూవీ నుండి థర్డ్ సాంగ్ ని విడుదల చేయనున్నట్లు సంగీత దర్శకుడు థమన్ తెలిపారు.
కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేసిన థమన్, థర్డ్ సాంగ్ అద్భుతమైన మెలోడీ అని, అది తప్పకుండా అందరినీ అలరిస్తుందని హార్ట్స్ ఎమోజీస్ ని పోస్ట్ చేసారు. కాగా దసరా నాడు గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ కానుండగా రిలీజ్ డేట్ ని ఆ రోజున అనౌన్స్ చేయనున్నారట మేకర్స్. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి.