మెగా పవర్ స్టార్ గ్లోబల్ ఐకాన్ అయిన రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా గేమ్ ఛేంజర్. రామ్ నందన్ ఐఏఎస్ అనే పవర్ఫుల్ అధికారి పాత్రలో చరణ్ కనిపించనున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఇతర కీలకపాత్రల్లో అంజలి, ఎస్ జె సూర్య, శ్రీకాంత్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న సంక్రాంతి కానుక గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానుంది.
ఇటీవల గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా ఫాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకున్నాయి. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని నవంబర్ 9న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా మేకర్స్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ఒక అనౌన్స్మెంట్ అందించారు. ఈ ఫస్ట్ లుక్ టీజర్ ని లక్నోలో జరిగేటువంటి గ్రాండ్ ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేయనున్నట్టు వారు తెలిపారు.
ఇక టీజర్ రిలీజ్ అనంతరం గేమ్ ఛేంజర్ కు సంబంధించి ఒక్కొక్కటిగా అప్డేట్స్ అన్నీ కూడా వరుసగా రానుండగా ఆపైన ప్రమోషన్ కార్యక్రమాల పై టీమ్ గట్టిగా దృష్టి పెట్టడం ఖాయం అని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో గేమ్ చేంజర్ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.