మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పొలిటికల్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో రామ్ చరణ్ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక చరణ్ కి జోడీగా బాలీవుడ్ అందాల నటి కియారా అద్వానీ కనిపించనున్న ఈ మూవీని దిల్ రాజు గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తుండగా శ్రీకాంత్, అంజలి, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
రేపు ఈ మూవీ నుండి రా మచ్చా మచ్చా అనే పాలవితో సాగె సెకండ్ సాంగ్ రిలీజ్ కానుండగా రానున్న క్రిస్మస్ కానుకగా మూవీని ఆడియన్స్ ముందుకి గ్రాండ్ గా తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని దసరా రోజున రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో దానికి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందట. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.