టాలీవుడ్ స్టార్ హీరోలో ఒకరైన గ్లోబల్ ఐకాన్ మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా యాక్షన్ పొలిటికల్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుక భారీ స్థాయిలో విడుదల కానుంది.
దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తుండగా కీలకపాత్రల్లో ఎస్ జె సూర్య, సునీల్, శ్రీకాంత్, అంజలి వంటి వారి నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా ఇది పక్కాగా రిలీజ్ అనంతరం గ్రాండ్ లెవెల్ లో సక్సెస్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. ఇటీవల గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా అందరినీ ఆకట్టుకుని సినిమాపై మరింతగా హైప్ ఏర్పరిచాయి.
కాగా మ్యాటర్ ఏమిటంటే ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని రానున్న దీపావళి పండుగ రోజున విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. త్వరలో దీనికి సంబంధించి వారి నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానుంది. మొత్తంగా జనవరి 10 ని విడుదల కానున్న గేమ్ చేజర్ మూవీ తప్పకుండా తమ హీరోకి భారీ బ్లాక్ బస్టర్ ఇస్తుందని ఇటు రాంచరణ్ ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.