మెగాపవర్ స్టార్ గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
వాస్తవానికి ఈ మూవీని డిసెంబర్ 20న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురావాలని యూనిట్ ఆలోచన చేస్తోంది, అయితే దీని పై పక్కాగా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇక గేమ్ ఛేంజర్ మూవీ నుండి మూడవ సాంగ్ ని ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేయనున్నాం అని, అది అందరినీ అలరించే మెలోడియస్ సాంగ్ అని తాజాగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు థమన్.
అలానే ఈ నెలలో దసరా పండుగ రోజున గేమ్ ఛేంజర్ నుండి టీజర్ వస్తుందని ఇప్పటికే వార్తలు రాగా, దానికి సంబంధించి ప్రస్తుతం టీమ్ పనిచేస్తోందని, అయితే పక్కాగా ఆ రోజున టీజర్ రిలీజ్ అవుతుందా లేదా అనేది చెప్పలేము అంటూ కూడా థమన్ ట్వీట్ చేసారు. దాంతో చరణ్ ఫ్యాన్స్ లో కొంత డిజప్పాయింట్మెంట్ కనపడుతోంది. అయితే నెలాఖరులో మూడవ సాంగ్ రిలీజ్ ఉండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.