టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాపవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మాస్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరినీ అలరించగా నేడు రా మచ్చా మచ్చా అనే పల్లవితో సాగె మాస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. నకాష్ అజీజ్ అద్భుతంగా ఆలపించిన ఈ సాంగ్ ని అనంత శ్రీరామ్ చక్కగా రాసారు. ముఖ్యంగా ఈ మాస్ బీట్ సాంగ్ యువతతో పాటు మాస్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో బాగా వ్యూస్ తో కొనసాగుతోంది.
ఇక అన్ని కార్యక్రమాలు ముగించి గేమ్ ఛేంజర్ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ మూవీలో రామ్ నందన్ అనే పవర్ఫుల్ పాత్ర చేస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో ఎస్ జె సూర్య, అంజలి, సునీల్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు.