మెగాపవర్ స్టార్ గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ అందాల నటి కియారా అద్వానీ హీరోయిన్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతోన్న భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్. ఇందులో ఐఏఎస్ అధికారి రామ్ నందన్ అనే పాత్రలో చరణ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి అందరిలో ఎన్నో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని శంకర్ తెరకెక్కిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
విషయం ఏమిటంటే, నేడు గేమ్ ఛేంజర్ నుండి సెకండ్ సాంగ్ అప్ డేట్ అందించారు మేకర్స్. రా మచ్చా మచ్చా అనే పల్లవితో సాగె ఈ సాంగ్ ని త్వరలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తమ అఫీషియల్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు. మరి డిసెంబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ కానున్న గేమ్ ఛేంజర్ ఎంతమేర ఆడియన్స్ ఫ్యాన్స్ అంచనాలు అందుకుంటుందో చూడాలి.