మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో దిల్ రాజు నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
శ్రీకాంత్, సునీల్, అంజలి, ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఇటీవల గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్.
విషయం ఏమిటంటే, నేడు వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ నుండి రామ్ చరణ్ పవర్ఫుల్ లుక్ తో పాటు సెకండ్ సాంగ్ ఈ సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తాం అంటూ మేకర్స్ ప్రకటించారు. అటు చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఇటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఆడియన్స్ ముందుకి రానుంది.