టాలీవుడ్ స్టార్ యాక్టర్ గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరచగా సెకండ్ సాంగ్ ని సెప్టెంబర్ 30న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ మూవీ పై చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే విషయం ఏమిటంటే, రా మచ్చా మచ్చా అనే పల్లవి తో సాగే ఈ సాంగ్ ని హైదరాబాద్ కొమ్మేపల్లి లో గల సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ లో మధ్యాహ్నం 2 గం. ల నుండి గ్రాండ్ గా నిర్వహించనున్న ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేయనున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు ముగించి గేమ్ ఛేంజర్ మూవీ ని డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.