మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పొలిటికల్ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈమూవీలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి మంచి రెస్పాన్స్ అందుకోగా సెకండ్ సాంగ్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ నెక్స్ట్ అప్ డేట్స్ సెప్టెంబర్ నుండి ప్రారంభం అవుతాయని ఇటీవల థమన్ ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ చెప్పారు.
కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ ని సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే దీని పై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకున్నేలా గేమ్ ఛేంజర్ ని శంకర్ తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా మూవీ సక్సెస్ అవుతుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.