మెగాపవర్ స్టార్ గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయమై కొన్నాళ్లుగా అందరిలో అయోమయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా నేడు విజయదశమి పండుగ సందర్భంగా కొద్దిసేపటి క్రితం గేమ్ ఛేంజర్ టీమ్ తమ మూవీ యొక్క అధికారిక రిలీజ్ ని ప్రకటించింది. ఇక ఈ మూవీని తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న దిల్ రాజు ఒక ప్రత్యేక వీడియో బైట్ ద్వారా రిలీజ్ ని అనౌన్స్ చేసారు.
వాస్తవానికి గేమ్ ఛేంజర్ మూవీని డిసెంబర్ నెలాఖరులో రిలీజ్ చేద్దాం అనుకున్నాం అని, కానీ అందరూ సంక్రాంతి అయితే బెటర్ అన్నారని తెలిపారు. కాగా అదే సమయానికి మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ ఉండడంతో ఈ విషయమై మెగాస్టార్ చిరంజీవిని అలానే ఆ మూవీ మేకర్స్ అయిన యువి క్రియేషన్స్ వారితో సంప్రదింపులు జరిపామని అన్నారు. ఫైనల్ గా వారు ఒప్పుకోవడంతో తమ గేమ్ ఛేంజర్ ని సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్లు తెలిపారు దిల్ రాజు.