గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. అంజలి, సునీల్, ఎస్ జె సూర్య, శ్రీకాంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి కావచ్చిన ఈ మూవీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
విషయం ఏమిటంటే, తాజాగా భారతీయుడు ప్రమోషన్స్ లో భాగంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి మీడియా వారు అడిగిన ప్రశ్నకు శంకర్ మాట్లాడుతూ, త్వరలో షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని, ఆపైన ఫైనల్ కాపీ పక్కాగా రెడీ చేసిన అనంతరం రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం అన్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుందని తెలిపారు.