మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా దిగ్గజ దర్శకుడు శంకర్ తో చరణ్ జతకడుతున్న ఈమూవీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం వేగంగా చివరి దశ షూటింగ్ లో ఉన్న గేమ్ ఛేంజర్ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి అందరినీ ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసింది.
విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 7న వినాయకచవితి పర్వదినం సందర్భంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న పుష్ప 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుండగా సరిగ్గా అక్కడి నుండి రెండు వారాల అనంతరం ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుందన్నమాట.