మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం ప్రముఖ దర్శకడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ జానర్ మూవీ గేమ్ ఛేంజర్. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీలో బాలీవుడ్ అందాలనటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
దీనిని గ్రాండ్ లెవెల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఎస్ జె సూర్య, సునీల్, అంజలి, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ మూవీ యొక్క రిలీజ్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
విషయం ఏమిటంటే, నేడు జరిగిన ధనుష్ లేటెస్ట్ మూవీ రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, మీ అందరూ గేమ్ ఛేంజర్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు, రానున్న క్రిస్మస్ కి కలుద్దాం అని తెలిపారు. దానితో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి అఫీషియల్ హ్యాండిల్ కూడా దానిని కన్ఫర్మ్ చేసింది. తమ హీరో మూవీ రిలీజ్ అనౌన్స్ అనౌన్స్ కావడంతో ఒక్కసారిగా రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఆనందం వెల్లివిరుస్తోంది. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన గేమ్ ఛేంజర్ క్రిస్మస్ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.